Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల వైద్యులకు ఘనసన్మానం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రాణాపాయ స్థితి నుండి ప్రాణాలు నిలబెట్టే పునర్జన్మనిచ్చే దేవుళ్లు వైద్యులని డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా స్థానిక కేఎస్పి రోడ్డులోని అను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను కొత్వాల ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వైద్య సేవలు అందించిన వైద్యులు గుజ్జల నీలధర్రెడ్డి, ఎం రాజా, కూరపాటి ప్రియాంకలతోపాటు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ బద్ది కిశోర్‌లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అద్యక్షులు మంతపూడి రాజుగౌడ్, జెడ్పిటిసి బరపటి వాసుదేవరావు, ఎంపిపి మడి సరస్వతి, కొత్వాల సీవేంద్ర వినరు దితరులు పాల్గొన్నారు.
నేతాజి యువజన సంఘం, జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నేతాజి యువజన సంఘం జనతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పలువురు డాక్టర్లను ఘనంగా సత్కరించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు దొర డాక్టర్ కే స్వాతి, డాక్టర్ నామాబుచ్చయ్య, డాక్టర్ పారుపల్లి పృధ్వీచంద్ర, డాక్టర్ సురేష్ పాండ్యా, కొత్తగూడెంకు చెందిన డాక్టర్ ప్రవీణ్‌రెడ్డిలకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షులు ఎస్జెకె అహ్మద్, సభ్యులు ఏవి రాఘవులు, సయ్యద్ అంజాద్, సయ్యద్ అక్బర్, మిట్టపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు
లయన్స్‌క్లబ్ ఆఫ్ పాల్వంచ గోల్డ్, లయన్స్‌క్లబ్ ఆఫ్ కిన్నెర ఆధ్వర్యంలో
వైద్యుల దినోత్సవం సందర్బంగా లయన్స్‌క్లబ్ ఆఫ్ పాల్వంచ గోల్ట్, లయన్స్‌క్లబ్ ఆఫ్ కిన్నెర సంయుక్త ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ వైద్య శాలలో పనిచేస్తున్న వైద్యులందరికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ ఇంటూరి రవికుమార్, లయన్స్‌క్లబ్ పాల్వంచ గోల్డ్ అద్యక్షులు పుట్టా నాగేశ్వరరావు, సెక్రటరీ సీష్, సభ్యులు ఆరుద్ర స్యనారాయణ, రాజమనోహర్, కతిÊ శ్రీను, మోహన్, లయన్స్‌క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెర అద్యక్షులు అరుణ్, సెక్రటరీ పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.
ముక్తేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో
డాక్టర్స్‌డే సందర్బంగా ముక్తేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యులను ట్రస్ట్ చైర్మెన్ ఎం గిరీష్ మొక్కను ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ నిమ్మకాయల బాలయ్య, డాక్టర్ యుగంధర్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుకృత, డాక్టర్ కిరణ్‌లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రవితేజ, నవీన్, రెడ్డిమల్ల శివమనికంట వీరన్న తదితరులు పాల్గొన్నారు.
కలియుగ దేవుళ్ళు డాక్టర్స్
కొత్తగూడెం : అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సింగరేణి కాలరీస్ మెయిన్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోవిడ్-19, కరోనా వైరస్ నుండి ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడిన డాక్టర్లు కలియుగ దైవాలుగా అభివర్ణించారు. సింగరేణిలో కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులు ఎంత మంది కరోనా బారినపడిన వారు డాక్టర్ల యొక్క గొప్పతనం వలన ఆరోగ్యంగా కోలుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి మెయిన్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమతా శ్రీనివాసరావు, అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రభాకర్ రావు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ కృష్ణమూర్తి తదితరులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్టు జనరల్ మేనేజర్ ఎన్.దామోదరరావు, కార్పొరేట్ లైజన్ ఆఫీసర్ మాలకొండయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రమేష్, ఇంటర్నల్ ఆడిట్ ఏజిఎం బి.బచ్చావ్, కేంద్ర కమిటీ సభ్యులు జీమిడి మల్లేష్, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ కె. మధుబాబు, కార్పొరేటర్ వైస్ ప్రెసిడెంట్ మోరే రమేష్ కుమార్, స్వామి, కృపాచలం, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.