Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్స్థాయిలో ఉచిత విద్యాబోధన
- కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్లాల్ హట్కర్
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలో ఆర్ట్గ్రూప్ ప్రారంభం అయ్యాయని ఆ కళాశాల ప్రిన్పిపాల్ రమేశ్లాల్ హట్కర్ విలేకర్లకు తెలిపారు. శేఖరంబంజరలో ఉన్న ఈ కళాశాల జిల్లాలోనే ఆర్ట్గ్రూప్ ఉన్న ఏకైక కళాశాల అని తెలిపారు. ఈ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆర్ట్ విభాగంలో ఆంగ్ల మాధ్యమంలో సిఈసి, హెచ్ఈసి గ్రూపులతో తరగతులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఈగ్రూపులను అభ్యసించడం ద్వారా నేటి పోటీ రంగంలో రాణించి ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందడానికి అవకాశం ఉందని అన్నారు. తమ కళాశాలలో విశాలమైన తరగతి గదులు, డార్మిటరీ, ఆహ్లాదకర వాతావరణంలో నిపుణుల ద్వారా సిపార్సు చేయబడిన భోధన ప్రణాళికలతో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా బోధించడం జరుగుతుందని చెప్పారు. అందుబాటులొ అత్యవసర వైద్య, ప్రాధమిక చికిత్స, పౌష్టికాహారంతో కూడిన భోజనం కల్పించడం సురక్షితమైన మినరల్ వాటర్, అనునిత్యం సిసి టివి నిఘాతో విద్యార్ధుల పర్యవేక్షణ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇండోర్, అవుట్డోర్ క్రీడలలో పాల్గొనే విధంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుందని చెప్పారు. ప్రధమ సంవత్సం ఇంటర్లో సిఈసి, హెచ్ఈసి గ్రూపులలో చేరుటకు పరిమిత సంఖ్యలో సీట్లు కలవని వీటికి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. కావునా 10వ తరగతి పాసైప మైనార్టీ బాలుర విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 6300708074 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు.