Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియా జనరల్ మేనేజర్ నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా 2021-22 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడిన 9.56 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 9.56 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100 శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు 29.76 లక్షల టన్నులకు గాను 29.77 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 100 శాతం ఉత్పత్తి లక్ష్యం సాదించినట్లు కొత్తగూడెం ఏరియా జిఎం సిహెచ్. నరసింహా రావు తెలిపారు. గురువారం ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిఎం మాట్లాడారు. జూన్ నెలలో రోడ్డు, రైల్ ద్వారా 30.73 లక్షల టన్నుల బొగ్గు వినియోగ దారులకు రవాణా చేశామని తెలిపారు. సత్తుపల్లి నందు సమంతా కంపనీ వారిచే నిర్మింపబడుతున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరగతిన జరుగుతున్నయని తెలిపారు. సత్తుపల్లిలో కార్మికులకు నిర్మించే 352 క్వార్టర్లలో నిర్మాణం పూర్తి అయిన 196 క్వార్టర్లను త్వరలో కార్మికులకు సీనియారిటీ ప్రకారం కేటాయిస్తామన్నారు. మిగతా క్వార్టర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నీ గనులు, డిపార్ట్మెంట్లలో ఉద్యోగులందరికి కోవిడ్ వ్యాక్షినేషన్ సెకండ్ డొస్ చెయవలసిన వారికి వ్యాక్షినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సియస్ఆర్ నిధులతో చుట్టు ప్రక్కల గ్రామాలలో బోర్లు, ఎల్ఇడి బల్బులు, ట్రీ గార్ద్స్ అందిచమని తెలినారు. ఈ విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జిఎం నారాయణ రావు, ఏరియా ఇంజనీర్ రఘురామి రెడ్డి, డిజిఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, డిజిఎం సివిల్ సూర్యనారాయణ, డిజిఎం ఐఈడి ఉజ్వల్ కుమార్ బెహ్రా, ఏరియా వర్క్ షాప్ ఎస్ఈ (ఈ అండ్ఎం) శ్రీకాంత్, సీనియర్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాం...
ఇల్లందు : 2021- జూన్ నెలలో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించామని జీయం మల్లెల సుబ్బారావు అన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. 4.09 లక్షల టన్నులకు గాను 5.26 లక్షల టన్నుల బొగ్గు తీయడం జరిగిందన్నారు. కె.ఒసి.లో 121 శాతం, జె.కె.ఓసి లో 138 శాతంతో మొత్తం 129 శాతంతో సింగరేణి లోనే మూడవ స్థానంలో నిలిచిందని అన్నారు. 4.69 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా, 0.85 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా మొత్తం 5.54 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం మరియు 131 రేకుల ద్వారా బొగ్గు బట్వాడా చేసామని తెలిపారు. ఏరియా లో ఇప్పటివరకు 133 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయల గృహ రుణాల ద్వారా వడ్డీ ని 116 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ హెల్త్ కార్డులు 1061 మందికి జారి చేశామన్నారు. ఉత్పత్తికి సమిష్టి కృషి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడం పట్ల సంబంధిత అధికారులకు ఉద్యోగులకు, సూపర్వైజర్ లకు, జి.యం అభినందించారు.