Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహదారిపై నిలిచిన నీటిలో మొక్కలు నాటి బీఎస్పీ వినూత్న నిరసన
- బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఏ మాత్రం జరగడం లేదని, పట్టణ ప్రగతి పేరుకు మాత్రమే అని, వార్డులో రోడ్డు మీద నిలిచిన నీటిలో మొక్కలు నాటి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ విన్నూత రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన మున్సిపల్ పాలకపక్షం, అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుందన్నారు. మున్సిపల్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ నుండి రామా టాకీస్ వెళ్ళే మున్సిపల్ రహదారిలోని గుంటలను చూస్తే పట్టణ ప్రగతిలో ఎంత దుర్భరంగా ఉందో తెలుస్తుందన్నారు. గురువారం పట్టణంలో పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమం ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని 29, 30వార్డుల మధ్యలో ఉన్న రహదారి చిరు జల్లులకే చెరువు అవుతుందన్నారు. చెరువును తలపించే విధంగా ఉన్న రోడ్డుపై హరిహారం మొక్కలు నాటి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ కన్వీనర్ బొంతు కిరణ్, వంగా రవిశంకర్, శ్రీనివాస్, ధనుంజరు తదితరులు పాల్గొన్నారు.