Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై అలుపెరగని పోరాటాలు
- బీజేపీ, టీఆర్ఎస్ పాలనలో పెరిగిన అత్యాచారాలు
- అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
- కరోనా కట్టడిలో నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
- తమ వంతు కర్తవ్యంగా రోగులకు సేవలు
- ఐద్వా ఇల్లందు మండల మహాసభలో రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-ఇల్లందు
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ, మహిళ హక్కులు, చట్టాల రక్షణకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ, మహిళలకు దిక్సూచిగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) నిలిచిందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.
ఖమ్మం జిల్లా ఇల్లందులో శీలపొగు గ్రేసుమని నగర్ ఉప్పల లక్ష్మి ప్రాంగణంలో గురువారం మండల 7వ మహాసభ నిర్వహించారు. తొలుత సంఘం జెండాను సీనియర్ నాయకురాలు సోమలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం జమున్నిసా, సంధ్యల అధ్యక్షతన జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. ఐద్వా మహిళ సంఘం మహిళ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు టిఆర్ఎస్, బీజేపీ పాలనలో పెరిగి పోయాయని అన్నారు. అరికట్టడంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. గ్యాస్, నిత్యావసర ధరలు పెరుగుతున్న గాని అదుపు చేయకుండా ప్రజలపై భారం మోపుతున్నాయని అన్నారు. కరోన ఒకవైపు విలయతాండవం చేస్తున్నా వ్యాక్సిన్ పెంచకుండా అందరికి టెస్టులు చేయకుండా అసమర్థ పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఐద్వా సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహకరిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో తమ వంతు కర్తవ్యంగా రోగులను ఆదుకునన్నామని అన్నారు. అనంతరం మహాసభనుద్దేశించి ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, రాష్ట్ర ఉపాధ్యద్యక్షురాలు బత్తుల హైమావతి, రాష్ట్ర నాయకులు మాచర్ల భారతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మర్లపాటి రేణుక, ఎం.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మెరుగు రమణ ప్రసంగించారు. సభలో ఆలేటి సంధ్య, జైమున్నిసా, ఎం లక్ష్మి, తాండ్ర కాంతమ్మ, పద్మ, అప్సర, వెంకటమ్మ, సుల్తానా, మణిక్యమ్మ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.