Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందీప్ కుమార్ సుల్తానియా
నవతెలంగాణ - అశ్వారావుపేట
ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకే పరిమితం అయిన పామ్ ఆయిల్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికిగానూ కార్యాచరణ రూపొందిస్తున్నామని,ఇందుకోసం ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం పల్లెప్రగతి మొదటి రోజు అశ్వారావుపేట నియోజక వర్గం,అన్నపురెడ్డి మండలం, అబ్బుగూడెంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో గల టి.ఎస్ ఆయిల్ ఫెడ్ కేంద్రీయ నర్శరీని,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ లతో ఆకస్మికంగా సందర్శించారు. పామ్ ఆయిల్ విత్తన సౌలభ్యం, మొక్కలు తయారీ,పెంపకం విధానం అనే అంశాలను ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జినుగు మరియన్న,ఆయిల్‌ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో పామ్ ఆయిల్ సాగు రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పామ్ ఆయిల్ సాగు రైతు సంఘం నాయకు ఆలపాటి రామచంద్రప్రసాద్ సాగు విధానం,ప్రభుత్వం చేయూత,గెలలు కోత,దిగుబడి, ఆదాయవ్యయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ నియోజక వర్గం అధికారి సందీప్, జెడ్.పి సి.ఇ.ఒ విద్యాలత, డీఆర్డీఏ పి.డి మధుసూధన్ రాజు, డి.పి.ఒ రమాకాంత్, పి.ఆర్ ఎస్.ఇ సీతారాములు, ఇ.ఇ సుధాకర్, డి.ఇ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అభిమన్యుడు, ఎ.ఒ నవీన్, మిషన్ భగీరథ గ్రిడ్ ఇ.ఇ నళినీ, డిఈ అభిషేక్, ఎఈ మణికంఠ, ఇంట్రా ఈఈ తిరుమలేశ్, డిఇ సలీమ్, ఎఈ లక్ష్మి లు పాల్గొన్నారు.