Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-మధిర
కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం నాలుగోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని నారాయణ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక చాలా చిన్న దేశాలు దేశ బడ్జెట్లో అత్యధిక శాతం ఆరోగ్యానికి కేటాయిస్తుంటే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో కేవలం 1.9 శాతం మాత్రమే ఆరోగ్యానికి కేటాయిస్తున్నారన్నారు. అది ఏ మూలకు సరిపోదన్నారు. బడ్జెట్ లో 5.6 శాతం కేటాయిస్తే హాస్పిటల్స్ బాగు చేయొచ్చు అన్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సమకూర్చుకోవచ్చు అన్నారు. అనంతరం మధిర మండల పరిధిలోని మల్లారం గ్రామంలో మందడపు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిం చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మల్లాది హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధని కుమార్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, అద్దంకి రవి కుమార్, సీపీఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, సీపీఐ మండల సెక్రటరీ ఉట్ల కొండల్ రావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి చావా మురళికృష్ణ, బీజేపీ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు షైక్ జహంగీర్, మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.