Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ- రఘునాధపాలెం
మండల పరిధి కోయచిలక గ్రామ పంచాయతీలో వైకుంఠధామం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, రేగుల చిలక, పాపటపల్లి గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి గురువారం మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కోయ చిలక గ్రామపంచాయతీలో సర్పంచ్ మాధంశెట్టి హరి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ... గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మండలంలో నిర్మించిన వైకుంఠధామాలలో 33 ప్రారంభోత్సవం చేసుకున్నామని, మిగిలిన 7 త్వరలో ప్రారంభోత్సవం చేసుకుంటామని ఆయన అన్నారు. మండల కేంద్రంలో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలంటే కనీసం 5ఎకరాల భూమి కావాలన్నారు. ఆ భూమిని త్వరలో గుర్తించి, మెగా ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామ న్నారు. తన పరిధిలో ఉన్న ఏకైక మండలం రఘునాధపాలెం, ఈ మండలాన్ని ఒక రోల్ మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, వారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అప్పట్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చేవన్నారు.ఇలాంటి వ్యాధులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది చేత డ్రైడే కార్యక్రమం చేపట్టి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సుడా చైర్మన్, బచ్చు విజరు కుమార్, రఘునాధపాలెం జడ్పిటిసి,మలోతూ ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరీ, వైస్ ఎంపీపీ, గుత్త రవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, కోయ చిలక ఎంపిటిసి, బలుసు పాటి సుజాత, కోయ చలక ,ఉపసర్పంచ్, చెరుకూరి, పూర్ణ చంద్రరావు, రేగుల చలక, గ్రామ సర్పంచ్ కొర్ల పాటి రామారావు, ఉప సర్పంచ్, నున్న వెంకటేశ్వర్లు, పాపట పల్లి గ్రామ సర్పంచ్, చెన్నబోయిన, ముత్తమ్మ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కుర్ర భాస్కరరావు, వివిధ గ్రామాల నాయకులు, ఆత్మ డైరెక్టర్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు,
హరితహారం మొక్కను నాటిన మంత్రి పువ్వాడ
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం నియోజకవర్గం పాపటపల్లి, కోయచలక, రేగులచలక గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజరు కుమార్ పర్యటించి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పారిశుధ్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రైతుబందు రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సుడా చైర్మన్ విజరు కుమార్, జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.