Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్లోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పలు కీలకమైన పథకాల్లో పల్లె, పట్టణ ప్రగతి ఒకటనీ, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పచ్చగా మారనున్నాయని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం గురించి ఎంపీ నామ పలు అంశాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులను విడదుల చేస్తోందని ఎంపీ నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ప్రతినెలా గ్రామాలకు రూ. 308కోట్లు, నగరాలు, పట్టణాలకు గాను రూ.148కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. 2020 ఆర్దిక సంవత్సరానికి గాను గ్రామాలకు రూ.3,627 కోట్లు, పట్టణాలు, నగరాలకు రూ.2,211కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు.రాష్ట్రంలో అడవులు అంతరించి పోకూడదన్న సదుద్దేశంతోనూ, తగ్గిన అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారని అన్నారు. 2015నుండి ఇప్పటి వరకూ మొత్తం 220.70కోట్ల మొక్కలను నాటారనీ, తాజాగా రానున్న పదిరోజుల్లో మరో 19.91కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారని నామ తఅన్నారు. హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటి వరకూ రూ.5,591 కోట్ల నిధులను ఖర్చుచేశారని ఎంపీ నామ గుర్తుచేశారు. ప్రస్తుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పల్లెల్లో మొక్కలు నాటేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 15,241నర్సరీల్లో 25కోట్ల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నాయని నామ అన్నారు.