Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- నేలకొండపల్లి
పైనంపల్లి గ్రామాన్ని పాలేరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తను, ముళ్ళచెట్లను తొలగిం చేందుకు మండలానికి ఒక జెసిబిని ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. తొలుత తమ్మర గ్రామంలోని సీతారామ కళ్యాణ మండపంలో జరుగుతున్న మండ్రాజుపల్లి గ్రామ సర్పంచ్ నెల్లూరు అనురాధ లీలాప్రసాద్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మండలంలోని నాచేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయం, పోతురాజు, వధ్యశిల విమాన శిఖరం ప్రతిష్ట, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గంగమ్మ తల్లి దేవాలయానికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన వారికి 16 లక్షల 98 వేల రూపాయల విలువైన 55 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను సందర్శించి ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించిన అడ్మిషన్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ తాసిల్దార్ వనజ, సర్పంచులు కొండ్రు విజయలక్ష్మి, మందడి రాజేష్, రాయపూడి నవీన్, ఎంపీటీసీలు బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, దోసపాటి కల్పన, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ పరంజ్యోతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సొసైటీ చైర్మన్ లు శ్రీనివాసరావు, తన్నీరు శ్రీనివాసరావు, కోటి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.