Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాళ్లూరి పంచాక్షరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలాన్ని సుందర భద్రాద్రిగా ఎటు చూసినా భద్రాచలం వచ్చే భక్తులకు కనువిందు చేస్తున్న మొక్కలు వున్నాయని తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం తాళ్లూరి పంచాక్షరయ్యను మర్యాదపూర్వకంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలాన్ని సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దినటువంటి గ్రీన్ భద్రాద్రి వారికి ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం గ్రీన్ భద్రాద్రి వారి మొక్కలు నాటే కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని రూ.5 వేలు భద్రాద్రి వారికి విరాళంగా అందించారు. ఈ క్రమంలో గ్రీన్ భద్రాద్రి సభ్యులు, అధ్యక్షులు భోగాల శ్రీనివాస రెడ్డి వారిని శాలువాతో, ఒక మొక్క ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఉప్పాల రాంప్రసాద్ రెడ్డి, వృక్ష మిత్ర గోళ్ళ భూపతి రావు, పీఆర్ఓ నాగరాజు, సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.