Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రంగా నిర్వహిస్తున్న దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యశాలకు రెండవ వైద్యుణ్ణి నియమించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, సీతారాంపురం ఎంపీటీసీ యలమంచి వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం మండలానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్కు ఆయన వినతి పత్రం అందజేశారు. దుమ్ముగూడెం వైద్యశాలకు గత మూడేళ్లుగా రెండవ వైద్యుడు లేక పోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకు పోయారు. కాగా మంత్రి పక్కనే ఉన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెల్లం వెంకట్రావ్ సైతం మంత్రికి తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి అజరు కుమార్ రెండవ వైద్యుణ్ణి నియమించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) నాయకులు మర్మం చంద్రయ్య తదితరులు ఉన్నారు.