Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఆర్డిఓ రవీంద్రనాథ్ ప్రజలకు సూచించారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో న్యూలక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలలో పల్లెవనంలు పలు వీధులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎంపిడిఓ డి.శ్రీనివాసరావు, ఎంపిఓ పి.సూర్య నారాయణ, ఆర్ఐ ఎం.ఏకవీర, సర్వేయర్ ఉష, పంచాయతీ సర్పంచ్లు వాకదాని కన్నయ్య, మాలోజి ఉషగోవింద్, పంచాయతీ కార్యదర్శులు ఓబినబోయిన రాంబాబు, అన్నేపాక రంజిత్ కుమార్, ఉపసర్పంచ్లు పోకల బాబు, వెల్లటూరు మైసయ్య, వార్డ్ మెంబర్స్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.