Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల పరిధిలోని మీనవోలు, పెద్ద గోపవరం గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని హరితహారం మొక్కలను నాటి గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్ చొరవతో మంజూరు కాబడిన బుచ్చిరెడ్డిపాలెం, వెంకటాపురం, ఇనగాలి, గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రెండు లక్షల పదిహేను వేల రూపాయల విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం గా నిర్వహించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు, ఎంపీడీవో కార్యాలయంలో విద్యుత్ లైట్లు పనిచేయటం లేదని వాటిని వెంటనే పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ శిరీష, జడ్పిటిసి కవిత, తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఇన్చార్జి ఎంపీడీవో రాజారావు, ఈవో ఆర్ డి శ్రీలక్ష్మి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏపీఓ నాగరాజు, పంబి సాంబశివరావు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు మొగిలి అప్పారావు, ఇనపనూరి శివాజీ, వేమిరెడ్డి అనురాధ, మూల్పూరి శ్రీనివాసరావు, వెంకటరామిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.