Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి జేవీఆర్ పార్కు పునరుద్ధరణ పనులు నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఎస్యూఎఫ్ఐడీసీ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 3, 4 వార్డుల పరిశీలనతో పాటు జేవీఆర్ పార్కు లో జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూడో విడత పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజల భాగస్వామ్యం తీసుకుని హరిత తెలంగాణ దిశగా అడుగులు వేయాలన్నారు. తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. శ్రమదానం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసే పనులు, పారిశుద్ధ్య పనులు 10 రోజుల్లో పూర్తి సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే సండ్ర అదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర జేవీఆర్ పార్కును పరిశీలించారు. పార్కులో నీరు నిలవడం, పిచ్చి మొక్కలు ఉండటంతో పార్కు నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని టీఎస్యూఎఫ్ఐడీసీ డీఈఈ రంజిత్‌కుమార్‌ను ఫోన్లో మాట్లాడారు. పార్కులో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, మేకల భవాని పాల్గొన్నారు.