Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
- దళిత సాధికారత పధకాలు పారదర్శకంగా ఏర్పాటు
- పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-భద్రాచలం
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహర్ధశ వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణంలో రూ.6.98 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్, రూ.16.91 లక్షల వ్యయంతో నిర్మించిన పట్టణ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కోరికని చెప్పారు. ప్రజా ప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. పట్టణ ప్రకృతి పార్క్‌లో శిథిలా వస్థలో ఉన్న భవనాలను తొలగించాలని చెప్పారు. పట్టణ ప్రకృతి పార్కు నందు మొక్కలు నాటారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారిత పథకం ప్రకటన పట్ల పట్టణంలోని రైతు వేదిక ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేడ్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, అంబెడ్కర్ సెంటర్లో గల అంబెడ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దళితుల అభివృద్ధికి తెచ్చిన సాధికారత ద్వారా అభివృద్ది సాధించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఎంపిక చేసి రూ.10 లక్షలతో ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మహబూబాద్ ఎంపీ మలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొందేం వీరయ్య, పీఓ గౌతమ్, ఎస్పీ సునీల్ దత్, అదనపు ఎస్పీ జి.వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీఆర్‌యస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు, మండల అధ్యక్షులు యశోద నగేష్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మండలంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరిత గతిన పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు అందజేసేలా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ అజరు కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పాల్గొన్నారు. ముందుగా ఆయన పర్ణశాల వైద్యశాల వద్ద కలెక్టర్ అనుదీప్‌తో కలసి పారిశుధ్య పనులు నిర్వహించి మొక్క నాటారు. అనంతరం మండలంలోని చిన్నబండిరేవు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గడ్డోరిగట్ట గ్రామ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన భద్రాచలం, చర్ల ప్రదాన రహదారి పెద్దనల్లబల్లి గ్రామ సమీపంలో కూలీలతో కలసి మొక్క నాటారు. అనంతరం తూరుబాక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన వైకుంఠ ధామం వద్ద మొక్క నాటారు. చిన్నబండిరేవు పల్లె ప్రకృతి వనం పక్కనే ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను చూసి ఐటీడీఏ జేఈ వెంకటేశ్వరరావును సున్నితంగా మందలించారు. డబుల్ బెడ్ ఇండ్లను ఎప్పుడు పూర్తి చేస్తారు అని అడిగి తెలుసు కోవడంతో పాటు 15 రోజుల్లో తాను మళ్లీ వస్తానని అప్పటిలోగా పెండింగ్ డబుల్ బెడ్ రూ ఇండ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా చిన్నబండిరేవు సర్పంచ్ కారం జయ, జెడ్పీటీసి తెల్లం సీతమ్మలు చిన్నబండిరేవులో నాలుగు సీసీ రహదారులతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిధులు మంజూరు చేయాలని ఆయనకు వినతి పత్రం ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ రేసులకీë, మండల అధికారులు, టీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.