Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేసారి జిల్లా కలెక్టరేట్, మెడికల్ కాలేజీ సీఎంతో శంఖుస్థాపన
- కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అజరు
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ భనవ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి దసరా నాటినుండి ఇక్కడి నుండే పరిపాలన కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్ నిర్మాణ పనులు జాప్యం అవుతుండడంతో పత్రికల్లోవచ్చిన వార్తలకు స్పందించిన మంత్రి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భవనాలు అన్ని తిరుగుతూ పరిశీలించారు. ఆలస్యం కావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ పనుల్లో జాప్యం జరగవద్దని వాటిని నివారించాలని కలెక్టర్ అనుదీప్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ నిర్మాణం కోవిడ్ కారణంగా జాప్యం జరిగిందని మూడు నెలల్లో ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని కలెక్టరేట్ పక్కనే ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారని కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు, మెడికల్ కాలేజీ శంఖుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మహబూబ్‌బాబ్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లకిëనారాయణ, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.