Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ... 100 మంది నిరుపేద పూజారులకు నిత్యావసర వస్తువులు...వికలాంగులకు వీల్‌ఛైర్, ట్రై సైకిళ్ల పంపిణీ'' కరోనా కష్టకాలంలో ఇలా ఎన్నో వితరణలు చేసి సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ ఎంతో ముందంజలో ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక లింబ్ సెంటర్లో శుక్రవారం జరిగిన పలు సేవ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా సమయంలో 25 మంది నిరుపేదల విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల కోసం రూ.10 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరకాలంగా గుళ్లుగోపురాలు తెరవకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వంద అర్చకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చేతన ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. కరోనా రెండో దశలో సుమారు రూ.50లక్షల విలువైన మెడికల్ కిట్లు, నిత్యావసర వస్తువులు అందజేశామని ఫౌండేషన్ అధ్యక్షులు వేదిగళ్ల అనిల్‌కుమార్ తెలిపారు. అనంతరం ముగ్గురు విద్యార్థులకు వీల్‌ఛైర్స్, ట్రైసైకిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ కార్యదర్శి పసుమర్తి రంగారావు, సభ్యులు ముత్తినేని సురేష్, మాదినేని నర్సింహారావు, చంద్రకాని నవీన్, షేక్ రషీద్, కరోనా కష్టకాలంలో ఫౌండేషన్ అధ్యక్షులు వెనిగళ్ల రవి దంపతులు, యూఎస్ఏ టీమ్‌ను ఎమ్మెల్యే సండ్ర ప్రత్యేకంగా అభినందించారు.