Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధలో ఉన్న కుటుంబాలకు
- పొంగులేటి ఆత్మీయ పలకరింపు తోడుగా ఉంటానని
- మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి హామీ
నవతెలంగాణ-చింతకాని
కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడుస్తూ నేనున్నాంటూ ధైర్యం నింపారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకొని దు:ఖంలో ఉన్న పలు బాధిత కుటుంబాలకు ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ పలకరింపులతో ఓదార్చారు. అధైర్యపడవద్దని మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.పలు మండలాల్లో మండలంలో ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను, ఆనారోగ్యానికి గురైన పలువురికి పరామర్శించి ఓదార్చారు. వందనం గ్రామంలో ఇటీవల మృతి చెందిన వట్టికాళ్ల అంజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి అంజిరెడ్డి కుమారులు అప్పిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను సభ్యులను ఓదార్చారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన పూజారి పాల్వంచ శంకర్రావు కుటుంబాన్ని పరామర్శించారు. శంకర్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు. మృతి చెందిన సుంకు పెద్దలాల్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు. కొదుమూరులో తల్లి మరణంతో బాధపడుతున్న టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు చిట్టిమోదు రాంబాబును పరామర్శించారు. అనంత సాగర్‌లో తల్లి మరణంతో బాధపడుతున్న నూతలపాటి వెంకటేశ్వర్లును పరామర్శించారు. మృతురాలు నూతలపాటి లక్ష్మీ బాయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. నరసింహాపురంలో కరోనా నుంచి కోలుకొని ఇంటి వద్దనే ఉంటున్న లంచపల్లి గోవిందరావును పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. చింతకాని మండల కేంద్రంలో మృతి చెందిన కర్నె లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సీతంపేటలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పానకాలును, బొప్పారంలో అనారోగ్యానికి గురైన మాజీ సర్పంచ్ షేక్ సిలార్ను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చింతకాని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ సభ్యులు పర్సగాని కిశోర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, రైతు రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు కిలారి మనోహర్, రైతుబంధు సమన్వయ జిల్లా డైరెక్టర్ మంకేన రమేష్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరు వెంకటేశ్వరరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి శేఖర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం: వివాహాది శుభ కార్యాల్లో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలోని మధురానగర్‌లో ఆదివారం జరిగిన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పట్టణంలో జరిగిన ముదిగొండ జడ్పీటీసీ పసుపులేటి దుర్గా-వెంకట్ కూతురు వివాహ నిశ్చితార్ధ వేడుకలకు మాజీ పొంగులేటి దంపతులు హాజరైయ్యారు. వధువరులను ఆశీర్వదించారు. తోడేటి లింగరాజు ఇంట్లో జరిగిన వివాహ వేడులకు పొంగులేటి హాజరై వధువరులకు నూతన వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించారు. ఇటీవల మృతి చెందిన ఎన్ఎస్పీ నర్సింహాస్వామి దేవాలయం ఏరియాకు చెందిన కుమ్మరి గురుమూర్తి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రఘునాథపాలెంలోని పంగిడిలో జరిగిన మాజీ సర్పంచ్ మోతీలాల్ కుమార్తె వివాహానికి హాజరైన నూతన వధువరులను ఆశీర్వదించారు.