Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులపై సమగ్ర విధానం ఉండాలి
- సీపీఐ(ఎం) నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
కృష్ణ, గోదావరి జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే పద్ధతి కాకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు అన్నారు. ఆదివారం సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరాలు ఉంటే ట్రిబ్యునళ్లు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. లేదా కోర్టులకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇవి కాకుండా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతులు అవలంభించడం సరైంది కాదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మరింత మోపుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకు పెంచుతూ పోతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కోవిడ్‌తో మరణించిన ప్రతి కుటుంబాన్నికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టులు చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గ వీటి సరళ, మాచర్ల భారతి పాల్గొన్నారు.