Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గతదారులతో అవస్ధలు
- పాటిమీదిగుంపులో అభివృద్దిని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం పాటిమీదిగుం పులో అసంపూర్తి నిర్మాణాలు దర్శనమి స్తున్నాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర విమర్శిం చారు. ఆదివారం పాటిమీదిగుంపులో సీపీఐ (ఎం) బృందం సమస్యల గుర్తింపు పాదయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక పనులు ఏండ్ల తరబడి నడుస్తునే ఉన్నాయన్నారు. నిర్ణిత సమయంలో పూర్తి కావల్సిన పనులు పూర్తికావటం లేదన్నారు. సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం పూర్తి అయినా వినియోగం లేదన్నారు. గ్రామంలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. వీధుల్లో నీరు నిలిచి పాకురుపట్టి, దారిలో నడిస్తే జారి పడేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ బజార్, చంధావత్ జోగ్యా బజార్, ఈసాల ఎల్లయ్య ఇంటి నుండి వాంకుడోత్ కిషన్ ఇంటి వరకు గల బజారు చిన్న వర్షానికే బురదయమంగా మూరుతుందన్నారు. చీమలపాడు వెళ్ళి మార్గం ఇరువైపుల పిచ్చిమొక్కలు, చెత్తచేదారంతో నిండి ఉందన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శంకుస్ధాపన చేసిన పాటిమీదిగుంపు-స్టేషన్ చీమలపాడు బీటీ రోడ్డు నేటి వరకు నిర్మాణం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాటిమీదిగుంపు సమస్యలపై అధికారులు స్పందించి పంచాయతీ అసంపూర్తి పనులు పూర్తి చేయటం, అంతర్గత రహదారుల పరిస్ధితిని మెరుగు పర్చటం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యురాలు సూరబాక ధనమ్మ, నాయకులు సూరబాక సర్వయ్య, దారావత్ సంతూ, బానోత్ బావుసింగ్, బానోత్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.