Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
పది మందితో ప్రారంభమైన సీపీఐ(ఎం) నేడు ప్రధాన పార్టీగా అవతరించటంలో అమరజీవి బోయినపల్లి పెద్ద విశ్వ నాదం కృషి భవిష్యత్తు తరానికి ఆదర్శంగా నిలిచింది. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన అమరజీవి బోయినపల్లి పెద్ద విశ్వ నాదం ఈనెల 22వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. నేడు చొప్పకట్లపాలెం గ్రామంలో కుటుంబ సభ్యులు దశ దిన కర్మలు నిర్వహించనున్నారు. విశ్వ నాదం తొలితరం కమ్యూనిస్టు నాయకుడు. పుట్టుకనుంచి కమ్యూనిస్టు పార్టీలో పెరిగాడు. అమర జీవులు తన్నీరు జగ్గయ్య, బొప్పాల శేషయ్య లాంటి తొలితరం కమ్యూనిస్టు నాయకులతో కలిసి చొప్పకట్లపాలెం గ్రామంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశాడు. నాడు కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం సీపీఐ(ఎం)లో వారితో పాటు చేరారు. ఆనాడు చొప్పకట్లపాలెం గ్రామంలో పదిమందితో కలిసి ఏర్పడిన సిపిఎం నేడు ప్రధాన పార్టీగా తయారుచేయడంలో విశ్వనాదం కృషి ఎంతో ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. పేద ప్రజల పట్ల అసంచలనమైన ప్రేమను, నమ్మకాన్ని చూపించేవారు. సిపిఎం వైపు ప్రజలను మళ్ళించడంలో ప్రధాన పాత్ర నిర్వహించిన వారిలో విశ్వ నాదం ఒకరు. తాను సీపీఐ(ఎం)లో ప్రధాన పాత్ర పోషించడమే కాక తమ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా సిపిఎంలో చురుకైన పాత్ర నిర్వహించే విధంగా తయారు చేశారు. తన కుమారులైన బోయినపల్లి పున్నయ్య, బోయినపల్లి సర్వయ్యలను కూడా సిపిఎంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని వారిరువురు నేటికీ కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారు.