Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త ఉదయం భార్య మధ్యాహ్నం
నవతెలంగాణ-బోనకల్
అనారోగ్యంతో మృతి చెందిన భర్త మృతదేహానికి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా భార్య కూడా మరణించిన విషాద సంఘటన మండల పరిధిలోని చిన్న బీరవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న బీరవల్లి గ్రామ సర్పంచ్ పేరబత్తిన శాంతయ్య తల్లిదండ్రులు ప్రకాశం(90), వజ్రములు. గత కొన్ని రోజులుగా ప్రకాశం(90) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మృతి చెందాడు. తండ్రి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుమారుడు శాంతయ్య, బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాలలో ప్రకాశం మృతదేహాన్ని దహన సంస్కారాలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య వజ్రమ్మ (80)అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ప్రాణాలు విడిచింది. భర్త మృతి చెందిన ఆరు గంటల వ్యవధిలోనే భార్య మృతి చెందటం ఆ కుటుంబాన్ని, గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడం, వారి అనుబంధానికి, అనురాగానికి నిదర్శనం అని గ్రామస్తులు అంటున్నారు.