Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశ్చర్యానికి గురిచేస్తున్న శ్రీనిధి వెంచర్ నిర్వహకుని పైరవి...?
నవతెలంగాణ-కొణిజర్ల
గత రెండు రోజుల కిందట ట్రైనీ కలెక్టర్ మండలంలో ఉన్నటువంటి ప్రయివేట్ వెంచర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులను వెంచర్లకు సంబంధించిన పత్రాలను తీసుకొని ఖమ్మం కార్యాలయానికి రావాలని సూచించిన మరుసటి రోజే తనికెళ్ళ జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్నా శ్రీనిధి వెంచర్‌కు అనుమతులు లేవని శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాత్రి సమయంలో అధికారులు ప్రొక్లైన్ తీసుకవచ్చి వెంచర్లోకి వెళ్ళే రహదారిని ధ్వంసం చేశారు. వెంచర్ ముందు ఏర్పాటు చేసిన హౌర్డింగ్పై ఉన్న ప్లెక్సీని తొలిగించారు. 24 గంటలు గడవకముందే ఆదివారం ఉదయం నాలుగోవ విడత పల్లెప్రగతి పేరుతో జిల్లా మంత్రి పువ్వాడ అజరు కూమార్, స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌ల ఫొటోలతో హౌర్డింగ్పై ప్లెక్సీని వెంచర్ నిర్వహకులు ఏర్పాటు చేయడం వెనక మర్మమేమిటో అనే చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. వెంచర్‌కు అనుమతులు లేకపోయినా మంత్రి, ఎమ్మెల్యే ఫొటోలతో హౌర్డింగ్పై ప్లెక్సీ ఏర్పాటు చేస్తే వెంచర్ అధికార పార్టీ నేతలదేమోనని తెలిసేలా అదేవిధంగా అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా వెంచర్లో యాజమాన్యం తెలివిగా నాలుగోవ విడత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.