Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితులకు నేనున్నానంటూ అండగా నిలుస్తున్న 'గిరిజన ఉపాధ్యాయుడు'
నవతెలంగాణ-బోనకల్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేయడంలోనే కాక సామాజిక సేవా కార్యక్రమాలలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. కరోనా మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి దగ్గరికి వెళ్లి నేను ఉన్నానంటూ అనేక రకాలుగా సేవలు, సహకారం అందిస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచాడు. మండల ప్రజలు అందరికీ ఉపయోగపడే విధంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను దాతల సహకారంతో ఇప్పించి ప్రాణదాతగా నిలిచాడు. ఆయనే మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన టీఎస్ యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుగులోతు రామకృష్ణ.
కరోనా ప్రారంభ దశ నుంచి రామకృష్ణ సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసుకుంటూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. తన సొంత ఖర్చులతో మండల ప్రజలకు ఉచితంగా హోమియో మందులు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనాను కట్టడిలో ప్రధాన భూమిక పోషిస్తున్న రక్షకభటులను సైతం సన్మానించి మరింత ముందుకు కొనసాగాలని ప్రోత్సాహాన్ని అందించారు. తన బావమరిది డాక్టర్ కేశవ నాయక్ సహకారంతో ఎంతోమందికి కరోనా బారిన పడిన వారికి వైద్యం చేయించారు. ఆస్పత్రికి రాలేనివారికి ఆన్ లైన్ లో వైద్య చికిత్స చేయించారు. కరోనా వ్యాధితో మృతి చెందిన బాణోతు స్వాతి అంత్యక్రియలు తన భుజస్కందాలపై వేసుకుని మిత్రుల సహకారంతో నిర్వహించాడు. టీఎస్‌యూటీఎఫ్ మండల శాఖ, మండల ఉపాధ్యాయుల చేయూతతో రూ.10వేల విలువచేసే నిత్యావసర వస్తువులను ఖమ్మంలోని వికలాంగులకు అందజేశారు. కరోనా రెండవ దశలోనూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య యాప్‌లో ఎంతోమందికి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఉచితంగా చేసి వారికి ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించారు. తాను సొంతంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి డాక్టర్లు కేశవ్ నాయక్, శ్రీవిద్య, శ్రీకాంత్లచే వైద్య చికిత్సలు చేయిస్తూ అవసరమైనవారికి సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. గ్రామంలో కరోనా బాధితులకు చికెన్, పండ్లు, కూరగాయలు, రాగి జావా అందజేశారు.
బోనకల్ మండల ఉపాధ్యాయులు, టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఇచ్చిన సహకారంతో రూ.44 వేలను వసూలు చేసి ఆ నగదును బోడేపూడి ఐసోలేషన్ కేంద్రానికి అందించడంలో చురుకైన ప్రధాన పాత్రను పోషించారు. వైద్యాధికారి శ్రీకాంత్ కోరిక మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు సహకారంతో చేతన ఫౌండేషన్ ద్వారా బోనకల్ పిహెచ్‌సికి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సెంట్రేట్ను ఇప్పించటంలో ప్రధాన పాత్ర నిర్వహించాడు.
మండల పీహెచ్సీలో కరోనా టెస్ట్ కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం అల్పాహార పంపిణీ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ సహకారంతో పాలుపంచుకున్నాడు. సంఘం మండల శాఖ చేయూతతో శాంతి నిలయంలోనే మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ విధంగా కరోనా బాధితులకు రామకృష్ణ సేవలు అందిస్తూ ఆదర్శనీయుడుగా నిలుస్తూ పలువురి చేత అభినందనలు అందుకుంటున్నారు.
5వ సారి ఖమ్మం ప్రభుత్వ
ఆసుపత్రికి కాయకల్ప అవార్డు ప్రోత్సాహక బహుమతులు వచ్చాయని వీరికి రూ50,000 లు నగదు పోత్సాహకంగా ఇస్తారని ఆమె చెప్పారు. ప్రకటించిన నగదు బహుమతిలో 75శాతం ఆస్పత్రి మౌళిక సదుపాయలకు, 25శాతం నగదును ఆసుపత్రి నందు సేవలు చేసిన సిబ్బందికి ఇన్సెంటివ్ ఇస్తారని ఆమె తెలిపారు. కాయకల్ప అవార్డు వచ్చిన ఆయా ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.