Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు
- ఒకే చోట లేక ప్రజల అవస్థలు పడుతున్న ప్రజలు
- సంత నిర్వహణకు అనుమతి ఇవ్వాలని వ్యాపారుల వేడుకోలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో వారాంతపు సంత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల క్రితం అధికారులు సంత నిలిపివేశారు. ప్రజల రద్దీ ఉండడంవల్ల కరోనా వైరస్ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో అధికారులు సంత నిర్వహించ కూడదని ఆదేశించారు. దీంతో ప్రతి ఆదివారం పట్టణంలో సింగరేణి ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించే భారీ సంత లేకుండాపోయింది. తాత్కాలికంగా ఆదివారం సంత కొత్తగూడెం-విజయవాడ జాతీయ రహదారి కిరువైపులా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకే దగ్గర కూరగాయలు, పండ్లు, ప్లాస్టిక్ సామాన్లు, కోళ్లు, చాపలు, కుండలు, పూల మొక్కలు, ఇరత సామాగ్రి అమ్ముకునే వారందరికీ స్థలం లేదు. కొత్తగూడెం వారంతపు సంతకు పరిసర గ్రామాలతో పాటు ఇతర జిల్లాలు, ఆంద్రప్రదేష్ రాష్ట్రం నుండి వాణిజ్యం కోసం వ్యాపారస్తులు వందలాదిగా వస్తుంటారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ ఆదికారులు సంత ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఆదివారం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు గల జాతీయ రహదారి పొడుగూతా రోడ్డుపైన దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంతా....ఉరంతా అన్న తీరుగా కనిపిస్తుంది. ప్రజలు ఒకే చోట అన్ని రకాల షాపుల నిర్వహణ లేకపోవడం వలన కొనుగోలు దారులు సౌలభ్యాన్ని, సౌకర్యానికి ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపల్ అధికారులు సంత నిర్వహణకు అవకాశం కల్పిస్తే వ్యాపారాలు మెరుగుపడతాయని వారంటున్నారు.
ఆదాయంలేదు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వారాంతపు సంత అతి పెద్దది కావడం గమనార్హం. ప్రతి ఆదివారం సంతలో వివిధ సమాగ్రిల అమ్మకాలు, కొనుగోలు ద్వారా లక్షలాది రూపాయల వ్యాపారం సాగుతుంది. గతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించేవారు. కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ప్రతి ఆదివారం వ్యాపారస్తుల నుండి పన్ను వసూలు చేయడం జరిగింది. గత ఏడాది కాంట్రాక్టర్ టెండర్ ముగియడంతో తిరిగి టెండర్ ప్రక్రియను మున్సిపల్ అధికారులు పూర్తి చేయలేదు. కారణంగా మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుందని పలువురు వార్డు కౌన్సిలర్స్ విమర్శిస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సంత నిర్వహణకు వెసులుబాటు కల్పిస్తే తమ వ్యాపారాలు ఒక దగ్గర నిర్వహించుకునే విధంగా అవకాశం ఉంటుందని, కొనుగోలుదారులకు వెసులుబాటు కలుగుతుందని వ్యాపారులు కోరుతున్నారు.
ప్రమాదం ఉంది : కొత్తగూడెం-విజయవాడ జాతీయ రహదారి పక్కన సంత వ్యాపారలు ఏర్పాటు వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉదయం, సాయంత్రం కొనుగోలు దారులతో రద్దీగా ఉంటుంది. కొత్తగూడెం నుండి బొగ్గు రవాణ చేస్తున్న లారీలు, ఇతర వాహనాలు వేగంగా వస్తుంటాయి. టూ వీలర్స్ అతివేగంగా వెలుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కావున జిల్లా కలెక్టర్ ఈ సంత నిర్వహణ విషయంలో సంబంధిత అధికారులకు మెరుగైన సూచనలు చేయాలని కోరుతున్నారు.