Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలలో గల వల్లభి మేజర్ పంచాయతీలో కరోనా విపత్కర పరిస్థితులలో వైరస్ బారినపడిన కరోనా బాధితులతోపాటు వితంతులకు, నిరుపేదలకు ఆగ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ పోట్ల కృష్ణకుమారి దంపతులు రూ.3000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎస్టీ దళిత బహుజనుల కాలనీలో సర్పంచ్ దంపతులు ఆదివారం పర్యటించి పలు కార్యక్రమాలు పరిశీలిస్తుండగా కాలనీలోనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ నిరుపేద వికలాంగుడికి రూ.1500 అందజేసి వారి దాతత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలోనే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న కొండూరు సుధాకర్‌కు రూ.4000 ఆర్థిక సహాయాన్ని అందించి అండదండగా పలువురికి ఆదర్శంగా నిలుస్తూ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని గ్రామసభ నిర్వహించి పారిశుద్ధ్యం, పచ్చదనం పరిశుభ్రతపై గ్రామప్రజలకు అవగాహన కల్పించి సీజనల్ వ్యాధులు కరోనా భారీన పడినవారికి ధైర్యాన్ని ఇస్తూ వైరస్ పరిస్థితులను అధిగమించేందుకు పంచాయతీ ప్రజలకు మనోధైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెల 1న పల్లెప్రగతి కార్యక్రమం గ్రామంలో ప్రారంభించి గ్రామసభ నిర్వహించారు. పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు గ్రామ ప్రత్యేక అధికారి సిహెచ్ వి రామారావుకు రూ.25 వేల చెక్కును గ్రామసర్పంచ్ దంపతులు అందజేశారు. రెండవ తారీకు నుండి పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో విరివిగా కొనసాగిస్తున్నారు. గ్రామవీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తూ డ్రైనేజీ కాలువలు పూడికతీత డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు, హరితహారం మొక్కలు నాటడం వాటిని సంరక్షించేందుకు చర్యలు పారిశుద్ధ్య సిబ్బందిచే ప్రతివారానికి ఒకసారి శానిటేషన్ నిర్వహిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను ఈనెల10 వరకు కొనసాగించనున్నారు.