Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి
- అమ్ముతున్నారని బెదిరింపులు
- అనధికారికంగా ఇండ్లల్లోకి చొరబడుతున్న ఎక్సైజ్ అధికారులు
నవతెలంగాణ-కొణిజర్ల
వైన్స్ షాపుల ప్రోద్బలంతోనే ఎక్సైజ్ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లల్లోకి చొరబడి దాడులు చేస్తున్నారని బెల్టు షాపులు నిర్వహించే బాధితులు వాపోతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించేవారు బయట నుండి మద్యం తెచ్చి అమ్ముతున్నారనే విషయాన్ని వైన్స్ షాపుల యాజమానులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వడం వలే ఇలాంటి దాడులు తరుచు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మండల పరిధిలోని విక్రమ్ నగర్ గ్రామంలో గురువారం ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపుల నిర్వహించే వారి ఇండ్లల్లో దాడులు చేసి మద్యం బయటనుండి తెచ్చి అమ్ముతున్నారని సమాచారం ఉండటంతోనే దాడులు చేస్తున్నామని చెప్పడం విశేషం. ఇదే విధంగా గత పదిహేను రోజుల క్రితం సింగరాయపాలెం గ్రామంలో కూడా ఎక్సైజ్ అధికారులు బెల్టు పాపులు నడిపేవారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి బయటనుండి మద్యం తెచ్చి అమ్ముతున్నా మద్యాన్ని స్వాధీనం చేసుకొని వెళ్లారని గుసగుసలు వినిపించాయి. అనధికారికంగా ఇండ్లల్లోకి చొరబడి సోదాలు చేసే అధికారం లేనప్పటికీ వైన్స్ షాపుల యాజమాన్యం ఆదేశాల మేరకు తమ ఇండ్లల్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బెదిరిస్తూ సోదాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.