Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- సీపీఐ(ఎం) అధ్వర్యంలో కొమురయ్య 75వ వర్ధంతి సభ
నవతెలంగాణ-కొత్తగూడెం
దొడ్డి కొమురయ్య వీర మరణం, నూతన పోరాటాలకు శ్రీకారమని భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచికంటి భవన్లో నిర్వహించారు. వర్ధంతి సభ ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, నైజాము నవాబులకి ఎదురొడ్డి నిలబడి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన దొడ్డి కొమురయ్య వీర మరణం నేటి తరానికి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుగులోత్ ధర్మ, కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్, రమేష్ కుమార్ మక్కడ్, సందకురు లక్ష్మి, కె.సత్య, రమేష్, ఉపేశ్, బీక్కులాల్ తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో....
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు, బలహీన వర్గాలకు భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నిర్మూలన కోసం తన ప్రాణాలు కోల్పోయిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
జీఎంపీఎస్ ఆధ్వర్యంలో....
కొమరయ్య ఆశయ సాధన కోసం పోరాడదామని జీఎంపీఎస్ రాష్ట్ర సలహాదారు కాసాని అయిలయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని అయిలయ్య మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టర్ ముందు కొమరయ్య విగ్రహం ప్రభుత్వం పెట్టాలని ముఖ్యమంత్రి హైదరాబాద్ ట్యాంకు బండపై విగ్రహం పెడుతానన్న మాట నిలుపుకోవాలని, కొమరయ్య పేరున పెద్ద కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జునుమాల నాగేశ్వారావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీ ఆధ్వర్యంలో.....
ఎన్డీ ఆధ్వర్యంలో చలమయ్య అధ్యక్షతన కొమరయ్య వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీ పట్టణ కార్యదర్శి కందగట్ల సురేందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు చలమయ్య, ఎస్కె. ఖాసీం, ఉమ, కళావతి, పుష్ప, రాధమ్మ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా ఎన్డీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం స్థానిక కొత్తగూడెం ఇప్టూ ఆపీసులో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎన్డీ డివిజన్ నాయకులు డి.ప్రసాద్, పార్టి పట్టణ కార్యదర్శి పి.సతీష్, డివిబి వీరభ్రహ్మచారి, గణేష్ .రాంమ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా ఐక్య ఉద్యమాలు, దోపిడి వ్యతిరేఖ పోరాటాలు ప్రజలు నిర్వహించాల్సి వుంటుందని ఎన్డీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.మధుసూదన్‌రెడ్డి, ఎండి గౌష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, ఓదెలు, ప్రభాకర్, సమ్మన్న, చారి తదితరులు పాల్గొన్నారు.