Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం అని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని వీరపూరం క్రాస్ రోడ్డులోని కొమరం భీమ్ విగ్రహం దగ్గర ఏడవ విడత హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం తడి పోడి చెత్త బుట్టలను స్థానికులకు పంపినీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, స్థానిక సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు, స్పెషల్ అధికారి బాబూరావు, తహశీల్దారు శివయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ అర్ఐ బాబు సెక్రటరీ చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రారంభించారు. పట్టణంలోని కరెంటు ఆఫీస్ ముందు, రెవెన్యూ కాలనీలో కరెంటు పోల్స్ మార్చే కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి పనులను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఏడిఈ వేణు , ఏఈ సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ల నరేష్, బలుసు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ డే కార్యక్రమంలో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. సోమవారం అయన ములక పాడు పంచాయతీలో పవర్ డే కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీ టీసీ తెల్లం సీతమ్మ, అధికారులు తదితరులు ఉన్నారు.
చండ్రుగొండ : మండలంలోని వికంపాడు గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పవర్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా పవర్ డే నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏఈ దేవా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటరెడ్డి, సర్పంచ్ రణ్య, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జూలూరుపాడు : పల్లె ప్రగతి భాగంగా మండలంలో విద్యుత్ శాఖ సోమవారం పవర్ డే సందర్భంగా పంచాయతీలలో పాడైపోయిన, విగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను పునరుద్ధరణ చేశారు.
గుండాల : పల్లె ప్రగతి నాలుగో విడతలో భాగంగా మండల కేంద్రంలో సోమవారం విద్యుత్ అదికారులు, ప్రజాప్రతినిధులు, అదికారుల ఆధ్వర్యంలో పవర్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ రామక్క, విద్యుత్ శాఖ ఏడీఈలు రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
గుండాల(ఆళ్ళపల్లి) : మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఏడీఈలు రాంబాబు, కోక్యా నాయక్, ఏఈ రవి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జడ్పీటీసీ కొమరం హనుమంతు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో విద్యుత్ మరమ్మతు పనులు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
టేకులపల్లి : మండల కేంద్రమైన టేకులపల్లిలో పల్లె ప్రగతి నాలుగో విడతలో భాగంగా ఐదో రోజు పవర్ డే సందర్భంగా కరెంట్ స్తంభాలను జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని 36 గ్రామపంచాయతీలలో కరెంటు స్తంభాలు డ్యామేజ్ అయిన చోట కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధా, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఎంపీడీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.