Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కల వెంకటయ్యను సన్మానించిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కవోని దీక్షతో మీరు చేస్తున్న కృషి రేపటి తరాలకు అందించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాలొ న్నారు. పర్యావరణ పరిరక్షణకు వెంకటయ్య చేపట్టిన మొక్కలు పెంచే గార్డెన్ సందర్శించారు. సోమవారం రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని మెక్కల వెంకటయ్య గృహాన్ని సందర్శించి మొక్కలు పెంపకాన్ని పరిశీలించారు. సమాజం పట్ల మీరు తీసుకుంటున్న చర్యలు ఎంతో అమూల్యమైనవని అతన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. మొక్కలు పెంపకాన్ని చేపట్టిన వ్యక్తులను, వారి గృహాన్ని సందర్శించి ప్రభుత్వం తరపున వారిని ఘనంగా సత్కరించాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సూచించారని తెలిపారు. వెంకటయ్య దంపతులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పెరటిలో పెంచుతున్న వివిధ మొక్కలను క్షణ్ణంగా పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్‌కుమార్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, తహసిల్దార్ రామకృష్ణ, కౌన్సిలర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.