Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన అవివాహితుడైన యువకుడు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా తనను ప్రేమిస్తున్నానని వెంట పడడంతో పాటు పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆ యువతి పేర్కొంది. తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ ఆమె ఆ యువకుడు ఇంటిముందు మౌన దీక్షకు కూర్చుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వివాహితను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.