Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సమస్యలపై శ్రద్ధ చూపాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నున్నా నాగేశ్వరరావు
- ఘనంగా సీపీఐ(ఎం)
జాన్ బాద్ తండా శాఖ మహాసభ
నవతెలంగాణ- రఘునాథపాలెం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం జాన్బాద్ తండా గ్రామ శాఖ మహాసభ జరిగింది. అనంతరం కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించికొని తర్వాత జరిగిన సభా కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక వాగ్దానాలు ఇచ్చి, ఎన్నికల తర్వాత వాటిని విస్మరించారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు, అసమానతలు రెచ్చగొట్టే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. కరోన పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, పాలకులు వ్యవహరించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపుతోం దన్నారు. గడిచిన 45రోజుల్లో 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దీనికి తోడు వంటగ్యాస్ ధరలు సామాన్యులను ఉలిక్కిపడేలా చేస్తున్నా యన్నారు. గిరిజన సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. తండాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయని, వాటికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని వారు స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. గిరిజన సాధికారత కోసం కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. నేటికీ అనేక మంది గిరిజనులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నాయని అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ నూతన కార్యదర్శిని భూక్యా కోటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్ర మంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు వేముల సదానంద్, ముత్యాలు సీపీఎం త్రీటౌన్ కార్యదర్శి తుశకుల లింగయ్య, మండల నాయకులు భూక్యా కృష్ణ, నాదెండ్ల పుల్లయ్య, గుగులోత్ కుమార్, ఇమామ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.