Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఏటుకూరి రామారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రావెళ్ల భవనంలో పార్టీ నాయకులు కెవి రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని సహకార సొసైటీలు, ఐకేపీ, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసిన ప్రభుత్వం తాలు, తరుగు పేరుతో క్వింటాకు ఐదు నుండి పది కేజీల వరకు మిల్లర్లు నిలువు దోపిడీ చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఖర్చులు, సరైన మద్దతు ధర ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి మిల్లర్లు చేస్తున్న దోపిడీతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతాంగం వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తున్నందున వారికి నాణ్యమైన విత్తనాలను అందించాలని, నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు, రాసాల కనకయ్య, పగిడికత్తుల నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, కట్టెకోల వెంకన్న, ఎడ్ల తిరుపతిరావు, సిరికొండ నాగేశ్వరరావు, పోతనబోయిన పెరుమాళ్ళు, బండి రామ్మూర్తి, సామల మల్లికార్జున్ రావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.