Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టహాసంగా పార్టీ గ్రామ శాఖ మహాసభలు నిర్వహించాలి...
- పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండి రమేష్
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం) శ్రేణులు నూతన పోరాటాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం ఖమ్మం రూరల్ మండలం కమిటీ,కార్పొరేషన్ మండల కమిటీ ల సమావేశం మండల నాయకులు తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో రమేష్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 11 నుంచి ఆగస్టు 15 వరకు మండలంలోని అన్ని గ్రామాల శాఖ మహాసభలు అట్టహాసంగా నిర్వహించాలన్నారు. ఈ శాఖ మహాసభల్లో గ్రామాల్లోని యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొని అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో లక్షల మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కష్ణా-గోదావరి జలాల సమస్యను బూచిగా చూపించి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, జిల్లా అధికారులు స్పందించి విలీన గ్రామాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్‌రెడ్డి, మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్ రావు, బందెల వెంకయ్య, సిలివేరు బాబు, నందిగామ కృష్ణ, పసుపులేటి సత్యనారాయణ, పుచ్చకాయల నాగేశ్వరరావు, మేడికొండ నాగేశ్వరరావు, సాల్వే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.