Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేనొచ్చి చెప్పినంక మీరెందుకు
- ప్రజలు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారా...?
- వార్డులన్నింటిలో పిచ్చిమొక్కలే
- ఆసక్తి లేకపోతే పదువుల నుండి స్వచ్ఛంగా తప్పుకోవాలి
- ఆకస్మిక తనిఖీల్లో కౌన్సిలర్లపై కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం
నవతెలంగాణ-కొత్తగూడెం
నేనొచ్చి చూసి చెప్తే కానీ పరిశుభ్రం చేయరా...? కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలి. అదే కదా మీ భాద్యత. వార్డుల్లో తిరుగుతుంటే ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్పా పటించుకోరా...? ఎక్కడా చూసినా పిచ్చిమొక్కలే ఉన్నాయి. శిధిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. ఇదేనా పట్టణ ప్రగతి అంటే..? అంటూ కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 3,6,7,9,12,14,15,16,20 వార్డుల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటనతో ఆకస్మిక తనిఖీ వార్డులో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించి తక్షణం పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 9వ వార్డులో సమస్యలు తాండవిస్తున్నాయని కౌన్సిలర్ పర్యవేక్షణ లేదని వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని, అప్పటికీ విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆసక్తి లేకపోతే పదువుల నుండి స్వచ్ఛంగా తప్పుకోవాలని కౌన్సిలర్లుకు సూచించారు. సింగరేణి సంస్థ పరిధిలోని భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని తక్షణం వాటిని కూల్చి వేయా లన్నారు. రామవరం పార్క్ నిర్వహణ అద్వాన్నంగా ఉన్న దని, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పార్కు నిర్వహణ లేకపోవడం వల్ల, మద్యం తాగుతున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారన్నారు. ఎందుకు ఇటువంటి దుస్థితి వచ్చిందని ప్రశ్నిం చారు. పార్కులో విద్యుత్ సౌకర్యం లేదు. నిర్వహణ లేదు. పిచ్చి మొక్కలతో అందహీనంగా తయారైందని వారం రోజు ల్లో అన్ని మారాలని, మళ్లీ తాను పర్యటిస్తానని ఆ సమ యంలో అపరిశుభ్రత ఉంటే కౌన్సిలర్లును సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మీ వల్ల కాకపోతే మున్సిపార్టీ నుండి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అందుకు రుసుము చెల్లించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. 3వ వార్డులో డంపింగ్ యార్డు నిర్మాణ పనులను 20 రోజుల్లో పూర్తి చేసి వర్మి కంపోస్టు తయారు చేయాలని చెప్పారు. 15వ వార్డులో నిర్మిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. రామవరంలోని గ్రంధాలయ స్థలాన్ని పరిశుభ్రం చేయించి మొక్కలు నాటాలని చెప్పారు. కోటి వృక్షార్చనలో నాటిన మొక్కల సంరక్షణ బావుందని, ఇదొక ఆక్సిజన్ పార్కులాగా ప్రజలకు ఉపయోగపడుతుందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మున్సిపల్ చైర్మెన్ను అభినంది ంచారు. మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారుల్లో మొ క్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ అరిగెల సంప త్కుమార్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, కౌన్సిలర్లు పులిగీత, రూప, విజయలక్ష్మీ, అఫ్జలున్సీసాబేగం, రాజకు మారి, అజ్మీర సుజాత, పరమేష్, పల్లపు లక్ష్మన్ పాల్గొన్నారు.