Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మండల పరిషత్ అధికారులు ఓటర్ లిస్ట్ ప్రకారం మండలంలో 57 సంవత్సరాలు నిండిన వారి లెక్కలను తేల్చారు. 2018 ఓటర్ లిస్ట్ ప్రకారం 57 సంవత్సరాలు నిండిన వారిలో 3,466 మంది అర్హులుగా గుర్తిస్తూ లెక్కలు తేల్చారు. ఇందులోనూ 713 మంది మాత్రమే ఆసరా పెన్షన్ల కు అర్హులని మండల అధికారులు లెక్కలు తేల్చారు. మిగిలిన వారు గతంలో పెన్షన్ రావడం, ఆదాయానికి మించి ఆస్తులు ఉండటం, ఇతర కారణాల చేత అర్హత లేని వారిగా తేల్చారు. నవంబర్ 2018 ఓటర్ లిస్టు ప్రకారంగా అధికారులు ఈ లెక్కలను తేల్చారు. ఈ లెక్కలు తేల్చిన తర్వాత మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మూడు సంవత్సరాలలో అనేకమంది 57 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు. వీరి పరిస్థితి ఏమిటన్నదే అయోమయం నెలకొని ఉన్నది. 2018 సంవత్సరంలో వయస్సు ప్రకారమే పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వయస్సు ప్రకారం చేయమని ఆదేశాలు ఉంటే తప్ప తాము ఏమీ చేయలేమని మండల అధికారులు అంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారంగా చూస్తే ఆళ్లపాడు లో 144 మంది గాను 31 మంది మాత్రమే ఆసరా పెన్షన్ కు అర్హులుగా తేలారు. బోనకల్లు లో 269 మందికి గాను 77 మంది, బ్రాహ్మణపల్లి లో 137 మందికి గాను 35 మంది చిన్న బీరవల్లి లో 111 మంది కి గాను 12 మంది చిరునోముల లో 176 మందికి గాను 42 మంది అర్హులుగా తేల్చారు. చొప్పకట్లపాలెం లో 183 మందికి గాను 48 మంది గార్లపాడు లో 54 మందికి 15 మంది గోవిందా పురం ఏ గ్రామంలో 69 మంది కి 2 గోవిందాపురం ఎల్ గ్రామంలో 177 మందికి 29 మంది జానకిపురం లో 113 మందికి 12 మందిని అర్హులుగా గుర్తించారు. కలకోట లో 181 మందికి 36 మందిని లక్ష్మీపురం లో 82 మందికి గాను 18 మందిని మోటమర్రి లో 244 మంది కి 37 మంది ని ముష్టి కుంట లో 343 మందికి 43 మంది ని నారాయణపురం లో 168 మంది కి 14 మందిని అర్హులుగా తేల్చారు. పెద్ద బీరవల్లి లో 171 మందికి 32 మందిని రామాపురం లో 81 మందికి 34 మంది ని రాపల్లి లో 63 మందికి 20 మందిని రావినూతల లో 366 మందికి 68 మందిని రాయన్న పేటలో 125 మందికి 32 మందిని సీతానగరం లో 47 మంది కి ఇద్దరిని తూటికుంట్ల లో 159 మందికి గాను 74 మందిని మాత్రమే ఆసరా పెన్షన్ కు అర్హులుగా అధికారులు తేల్చారు. గ్రామాల వారీగా ప్రస్తుత వయస్సు ప్రకారం పరిశీలిస్తే మండల వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది వరకు ఉండవచ్చునని అంచనా. 2018 సంవత్సరం ఓటర్ లిస్ట్ ప్రకారం ఆసరా పెన్షన్ లు ఇస్తారా, ప్రస్తుత వయస్సు ప్రకారం ఆసరా పెన్షన్లు ఇస్తారా వేచి చూద్దాం.