Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబోదిబోమంటున్న వినియోగదారులు
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ మండల కేంద్రంలో గల బస్టాండ్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ ఫార్మర్కు అనుసంధానంగా స్టేషన్ పరిధిలో దాదాపు 200 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ట్రాన్స్ ఫారమ్‌లో కలుగుతున్న సాంకేతిక లోపం వలన ఒక ఫేస్ హై ఓల్ట్జిగా ఒక ఫేస్ లోఓల్టేజీగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. దాని వలన బోనకల్ స్టేషన్ ప్రాంతంలో చాలామందికి చెందిన విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయి. 4 నెలల క్రితం సుమారు 10 మంది ఇళ్లల్లో టీవీలు, ఇన్వెస్టర్లు, ఫ్యాన్లు, కాలిపోగా బోనకల్ మండలం విద్యుత్ అధికారికి స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఉన్న మండల విద్యుత్ అధికారి నెల్లూరు సతీష్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. కానీ ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి వచ్చిన హైవోల్టేజి వలన పలువురికి చెందిన టీవీలు, ఫ్యాన్లు ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. బోనకల్ స్టేషన్లో ఎక్కువ శాతం రోజువారీ కూలీ పనులు చేసుకొని జీవించే వారే ఎక్కువమంది ఉన్నారు. హైఓల్టేజీ వలన పలుమార్లు విద్యుత్ పరికరాలు కాలిపోవడం వలన వాటికి మరమ్మతులు చేయించుకోలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతు న్నారు.
ఇన్చార్జ్ ఎఈ
నాగేశ్వరరావు వివరణ
ట్రాన్స్ ఫారంలో ఉన్న ఇంటర్నల్ ఫీజులు పోవటం వల్ల ఇలా జరుగుతుంది. దానికి విద్యుత్ శాఖకు ఎలాంటి బాధ్యత లేదు. కావున ప్రతి ఒక్కరు వారి ఇళ్లల్లో ఎంసిబిలు బిగించుకోవాలి.