Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- మహమ్మద్ బిన్ సయ్యద్ వర్ధంతి సభ
నవతెలంగాణ -మిర్యాలగూడ
ప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మహమ్మద్ బిన్సయ్యద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద, సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం మొహ్మద్ బిన్సయ్యద్ ఎంతో కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం పాటు పడ్డారని తెలిపారు. కార్మికులను ఏకం చేసి వారితో సంఘాలు పెట్టించి వారి హక్కుల సాధన కోసం తీవ్రంగా పోరాడారని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన అకాల మృతి ప్రజా ఉద్యమానికి, కార్మిక లోకానికి తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మహమ్మద్ బిన్ సయ్యద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంక టేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నూకల జగదీష్చంద్ర, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి పాల్గొన్నారు.