Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ బడులను బలోపేతమే
ఫౌండేషన్ సంకల్పం...
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సమాజం మనకేం చేసిందని కాదు... సమాజానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యమంటారాయన... నలుగురిలో ఒకరిలా కాదు....ఆ నలుగురి కోసం చేసే సహాయంలోనే సంతప్తిని వెతుక్కుంటాడు... పేద విద్యార్థులకు సోదరుడినంటాడు... ఆపదలో ఉన్నోళ్లను అయినోన్ని అంటూ.. వారి బాధలు తీరుస్తుంటాడు. వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూసే నేటి సమాజంలో నలుగురికి అండగా ఉండడంలోనే పరమార్ధం ఉందంటాడు కస్తూరి ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ చరణ్. తన చదువు కోసం తన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మరెవ్వరూ పడకూడదనే ధడ సంకల్పమే తనను సేవా దక్పథానికి నాంది పలికింది. నేను నా కుటుంబం అనుకునే ఈ రోజుల్లో కూడా సమాజ సేవకే జీవితాన్ని త్యాగం చేసిన కస్తూరి ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ చరణ్ .తన టీమ్ సభ్యులతో కలిసి సేవ కార్యక్రమాలతో నిరుపేదల ఇంట్లో కుటుంబ సభ్యులుగా మారారు. తన చిన్ననాటి కష్టాలు మరో ఇంట్లో ఉండొద్దు అని నిచ్ఛయించుకున్న చరణ్ కస్తూరి స్వచ్చంద సంస్థ ద్వార తెలంగాణ రాష్టంలో పేద విద్యార్థులకు చేయుతను ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా కస్తూరి ఫౌండేషన్ పేరుతో ఎన్నో గడపల్లో వెలుగుని నింపారు. ఎక్కడికి వెళ్లినా పేద విద్యార్థుల గురించి తెలుకోవడం వారికి చేతనైన సహాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు కస్తూరి ఫౌండేషన్ సభ్యులు.
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా...
తన చదువు కోసం తన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదనే సంకల్పంతో కస్తూరి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీచరణ్, చదువుకోవాలనే సంకల్పం ఉన్నా పేదరికం వెక్కిరిస్తున్న కుటుంబాల్లోని పిల్లలకు చేయూతనిస్తూ అండగా నిలిస్తున్నాడు. చదువే అన్ని సమస్యలకు పరిష్కారం. కస్తూరి ఫౌండేషన్ తో సొంత జిల్లా నల్గొండ నుంచి ప్రారంభమైన తన సేవాప్రస్థానం ఆదిలాబాద్ మీదుగా తెలంగాణ అంతటా విస్తరించింది. చదువు కోసం 'అన్నా అన్నవారిని నేనున్నానంటూ' నిరుపేద కుటుంబాల పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఎందరో పేద విద్యార్థులు ఆర్థిక భారం మోయలేక చదువులకు దూరమై బాలకార్మికులుగా మారుతున్న పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నత చదువులు చదివేలా అండగా నిలుస్తున్నారు. ఓవైపు నిరుపేద విద్యార్థుల చదువులకు ఆర్థికంగా అండగా ఉంటూనే, మరోవైపు అదే విద్యార్థులు చదువుకునే స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు తనవంతు కషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
వాటిల్లో మచ్చుకు ఇలా...
- గుర్రంపోడు మండల కొప్పొలు ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు బెంచీలు, విద్యుత్ పరికరాలు, రంగులు, ప్రోజెక్టర్, బ్లాక్బోర్డుల ఏర్పాటు కోసం రూ.6లక్షలు సహాయం చేశాం.
- చండూరు మండలం పుల్లెంల ప్రాథమిక, హైస్కూల్ పాఠశాలల మరమ్మతులు, తలుపులు, బెంచీలు, విద్యుత్ కనెక్షన్, బెంచీలు ఏర్పాటు కోసం రూ.6లక్షలు ఆర్ధిక సహకారం అందించాం.
- నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాల మరమ్మతులు, భవనానికి రంగులు తదితర వాటికోసం రూ.3.50లక్షల అందించాం.
- పలివెల ఉన్నత పాఠశాల భవన మరమ్మతుల కోసం రూ.1.50లక్షలు ఖర్చు చేశాం. ఇవేగాకుండా అనేక పాఠశాలలో గదుల మరమ్మతులు చేపించి, చూడచక్కని పేయింట్లతో పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తున్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు బూట్లు, బెల్ట్స్, టై లు అందజేస్తూ విద్యార్థులు కూర్చోడానికి కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు అందజేస్తున్నారు.
రూ.2కోట్లు సహాయం ..
ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్లకు పైగా ఆర్థికసహాయం అందించారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా 12 మంది టీమ్ సభ్యులు విద్యార్థుల చదువులకు అండగా ఉంటూనే, మరోవైపు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తూ ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం చేస్తూ ఉన్నత చదువులు చదివేలా పోత్సహిస్తున్నారు. గతేడాది నల్లగొండ ప్రభుత్వ స్కూళ్లలో పదవ తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన 13 మంది విద్యార్థులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కసరాలు అందజేశారు.
-పేదవిద్యార్థులనుఆదుకోవడమేలక్ష్యం..
-శ్రీచరణ్,చైర్మెన్కస్తూరిఫౌండేషన్
తనను చదివించడం కోసం తన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదనే సంకల్పంతో కస్తూరి ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. పేద పిల్లల చదువు కోసం, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తన లక్ష్యమని, దానికోసం నా శాయశక్తులా కషి చేస్తానంటున్నారు.