Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవపు కనకయ్య పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలోని పోడు భూముల సమస్య పరిష్కారం కోసం జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపిఎం కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. బుధవారం లక్మి దేవిపల్లి సిపిఎం మండల కమిటీ సమావేశం నునవత్ సూర్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయిందని, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఆదివాసీల భూములపై ఫారెస్ట్ అధికారులను ఎగదోసి పోడు భూములు గుజుకుంటున్నారని మండిపడ్డారు. గుేరువారం పోడు భూముల సమస్యకోసం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే పోరాటాన్ని విజయవంతం చేయాలని, భారీగా తరలి రావాని విజ్ఞప్తి చేశారు. పార్టీ శాఖ మహా సభలు జరపాలని, సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని అన్నవరపు కనకయ్య పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో మచ్చ వెంకటేశ్వర్లు, జటోంత్ కృష్ణ, మండల కార్యదర్శి నల్లమల సత్యనారాయణ, వాంకుడోత్్ కోబల్, వాంకుడోత్ అమర్ సింగ్, వెంకన్న, నాగేశ్వరరావు పాల్గొన్నారు.