Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుర్గ కంపెనీలో తప్పిన పెద్ద ప్రమాదం
- ఓబీ కంపెనీలు కార్మికుల రక్షణను గాలికి వదిలేసింది... ఏఐటియుసి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి ఏరియా పరిధిలోని ఓపెన్ కాస్ట్ మైన్స్‌లలో ఓబి కంపెనీలు కార్మికులకు రక్షణ చర్యలు పాటించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్ ఆరోపించారు. బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ...ఓసిలలో ప్రమాదం జరిగి సూపర్వైజర్ అయిన కార్మికుడు మరణించి విషయం మరవక ముందే ఓసి4 దుర్గ కంపెనీలో మంగళవారం రోజున డ్రైవర్ లేకుండా వాల్వా వాహనం కిలోమీటర్‌కు పైగా రన్ అయి హై వాహనాలను ఢకొీట్టింది. ఈ సంఘటన చాలా బాధకరమన్నారు. కార్మికుల రక్షణ, వాహనాల ఫిట్నెస్ పట్ల మేనేజ్మెంట్, ఓబి కంపెనీలు శ్రద్ధ వహించడం లేదని మండిపడ్డారు. వాల్వా రన్ అవడం చిన్న విషయం కాదని ఆ సమయంలో వేరే వాల్వా వాహనాలు రాకపోవడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పిందన్నారు. సింగరేణి యాజమాన్యం ఓబి కంపెనీలో కార్మికుల రక్షణను గాలికి వదిలేసిందన్నారు. ఈ సంఘటణపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు నజీరుద్దీన్బాబా, రామనర్సయ్య, సుభానీ, నాగరాజు, యోహన్, సుధకార్ తదితరులు పాల్గొన్నారు.