Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక
- గువ్వలగూడెం సర్పంచ్, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ- నేలకొండపల్లి
వైకుంఠధామం నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక అధికారులను ఆదేశించారు. మండలంలోని గువ్వలగూడెం, కోనాయిగూడెం గ్రామాలలో వైకుంఠధామం నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. గువ్వలగూడెంలో వైకుంఠధామం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అక్కడి గ్రామ సర్పంచ్ వంగూరి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గిరిధర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం కోనాయిగూడెం గ్రామంలో వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. మరో పది రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామం నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ విరుపాక్షి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈజీఎస్ ఏపిఓ ఆర్ సునీత, పిఆర్ ఏఈ విద్యాసాగర్, సర్పంచ్ పెంటమల్ల పుల్లమ్మ, కార్యదర్శి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి : మండలంలో పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామలా నిర్మాణాల పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక ఆదేశించారు. బుధవారం మండలంలోని మల్లేపల్లి, గట్టుసింగారం గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఈసందర్భంగా మల్లేపల్లి గ్రామంలో ఎవిన్యూ ప్లాంటేషన్ కొరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసినదిగా సర్పంచ్ మరియు కార్యదర్శికి సూచించారు. అనంతరం గట్టుసింగారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం పురోగతిని పరిశీలించి మిగిలిన పనులు 15వ తేదీలోపు పూర్తి చేయాలని మరియు గ్రామంలో పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగించాలని గ్రామ సర్పంచ్‌ని ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, యంపిడిఓ కరుణాకర్‌రెడ్డి, యంపిఓ రాంచందర్ రావు, ఏపిఓ అప్పారావు, గ్రామ పంచాయతీ సర్పంచులు నాగేశ్వరరావు, ఖాదర్ బాబు, కార్యదర్శులు పాల్గొన్నారు.