Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
భారీ అభివృద్ధి ప్రణాళికల అమలుకు ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ కోయికోడ్, జూలై 2021 260 షోరూములతో, 10 దేశాలలో విస్తరించి, బలమైన గ్లోబల్ రిటైల్ నెట్వర్క్ కలిగియున్న ప్రముఖ ఆభరణాల రిటైల్ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, తమ వ్యాపార కార్యకలాపాల కోసం భారత దేశంలోని తమ రిటైల్ షోరూములు బ్రాండు ప్రధాన కార్యాలయము మరియు సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మలబార్ బ్రాండు రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చెయ్యడానికి ఈ నియామకాలు చేపడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో తలెత్తి దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ఉద్యోగ నియామకాలపై తీవ్ర ప్రభావం పడిన తరుణంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చేపట్టిన ఈ నియామక ప్రక్రియ ఉద్యోగార్థులకు సరికొత్త అవకాశాలను సృష్టించే ే లక్ష్యంగా పని చేస్తుంది.
హై స్ట్రీట్స్, ప్రఖ్యాత మాల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ మరియు ట్రావెల్ రిటైల్ వంటి వివిధ రిటైల్ ఫార్మాటను ఉపయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో 50కు పైగా భాషా నైపుణ్యం కలిగిన బృందాల మద్దతుతో వినియోగదారులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా రిటైల్ సేల్స్ ఫ్లోర్ ఆపరేషన్స్ మరియు అకౌంటెంట్లు వంటి స్థానాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో సగం అరులైన మహిళా అభ్యర్థుల కోసం కేటాయించారు. అదనంగా, ఆభరణాల రిటైల్ అమ్మకాలు మరియు కార్యకలాపాల్లో నైపుణ్యం అందించడానికి బీటెక్, ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ షిప్‌లను కూడా ఇవ్వబడుతున్నాయి. ప్రస్తుతం డిజైన్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్ (వృత్తి నిపుణులు, సప్లై చైన్ మేనేజ్మెంట్, మర్చండైజింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బిజినెస్ అనలిటిక్స్ ఐటి మొదలగు ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ ఖాళీలు అధికంగా కోజికోడ్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయం మరియు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు కలకత్తా లోని ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్నాయి. సంఖ్య మరియు టర్నోవర్ రెండింటి పరంగా ప్రపంచంలోనే ప్రముఖ బాధ్యతాయుతమైన ఆభరణాల రిటైల్ బ్రాండ్ అవతరించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉండనుంది. మంచి జీతభత్యాలతో కూడిన 5,000 ఉద్యోగాలు అదనంగా సృష్టించడానికి ప్రేరణగా బాధ్యతాయుతమైన వ్యాపార నిర్వహణ, సమాజం పట్ల మాకున్న బాధ్యత వంటి విషయాలు ముందు వరుసలో ఉండనున్నాయి. ఉద్యోగులు సంస్థ విజయానికి మూలస్థంభంగా ఉన్నారు. తగిన అర్హత కలిగిన ప్రతిభావంతులను నియమించడం, వారికి నేర్చుకునే మరియు అభివృద్ధి చెందే అవకాశాలను అందించడంలో ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తున్నారు. తమ అభివృద్ధి ప్రణాళికల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని, మరియు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తులను మా మలబార్ కుటుంబంలో భాగం కావాలని.. ఆహ్వానిస్తున్నామని మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎంపి అహ్మద్ అన్నారు. నమ్మకం, విశ్వసనీయత మరియు పారదర్శకత వంటి విలువలతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క అభివృద్ధి పెనవేసుకుంది. ఫలితంగా ప్రపంచ ఆభరణాల రిటైల్ రంగంలో మలబార్ బ్రాండ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. ప్రత్యేకమైన నిర్వహణ పద్ధతులు మరియు అది సృష్టించిన వలన చాలా మంది ఉద్యోగులు సంస్థలో పెట్టుబడిదారులుగా మారారు. సురక్షితమైన పని ప్రదేశంతో పాటు, ఉద్యోగులను తమతో కలుపుకు పోయే స్నేహపూర్వక వాతావరణానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రసిద్ధి చెందింది. ప్రతిభావంతులైన ఉద్యోగులను ప్రొఫెషనల్ మేనేజర్ల స్థాయికి పదోన్నతులు కల్పించడం వంటి సంఘటనలు తమ సహకార తత్వానికి మరియు అందరి అభివృద్ధిపై బ్రాండ్ దృష్టి పెడుతుందని చెప్పడానికి నిదర్శనాలు. సమాన అవకాశాలు అందించే ఉద్యోగ ప్రదాతగా ఉండాలనే లక్ష్యాలకు కట్టుబడుతూ, సంస్థలో మహిళల ప్రాతినిధ్యం పెంచడం మరియు రిటైల్ హాస్పిటాలిటీ నేపథ్యాల నుండి అర్హత కలిగిన మహిళా విద్యార్థులకు అమ్మకాలు, అతిథి మర్యాదలు, నిర్వహణ వంటి ఉద్యోగాలు అందించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ సాయి నుండి రీజియన్ హెర్ హౌదాకు నియమిత వ్యవధిలో చేరుకోడానికి వీలు కల్పించే శశిక్ష అభివృద్ధి మరియు కెరీర్ పురోగతి ప్రక్రియల కోసం తగిన ప్రణాళికలు కూడా రూపుదిద్ధుకుంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ ఆన్లైన్ జాబ్ పోర్టల్ %షషష.ఎaశ్రీabaతీjశీbర.ఱఅ% ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. అభ్యర్థుల ప్రయోజనం కోసం జాబ్ ప్రొఫైల్, కీ డెలివరీలు, అవసరమైన అనుభవం మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడుతుంది. రాబోయే రోజులో వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా అదనపు నవీకరణలు తెలియజేయబడతాయి. తమ విస్తరణ కార్యకలాపాలు భారతదేశంలోని కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. భారత దేశంలోని కీలక మార్కెట్లు అయిన చెన్నై లక్నీ, హైదరాబాద్ ముంబై, పూచే మరియు బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు ఏలూరు, మంచిర్యాల్, సోలాపూర్ మరియు అహ్మద్ నగర్ వంటి పట్టణాల్లో మలబార్ బ్రాండ్ రిటైల్ షోరూములు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా కెనడా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్ మరియు ఇతర ఆఫ్రికన్ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించబడతాయని యాజమాన్యం తెలిపింది.