Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
పల్లెల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీలకు నిధులు ప్రతినెలా విడుదల చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని పల్లే ప్రగతిలో బాగంగా జానికిపురం, చిన్న బీరవల్లి గ్రామాలలో బుధవారం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జానకీపురంలో పల్లెప్రగతిలో బాగంగా కమల్ రాజు మొక్కలు నాటారు. ఆనంతరం గ్రామప్రజలకు ఆయన మొక్కలు పంపిణి చేసారు. కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎంపీఓ కర్నాటి శ్రీనివాసరెడ్డి, ఈజీఎస్ ఇసి బెల్లంకొండ సతీష్, టిఆర్ఎస్ మండల కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, జానకిపురం, రావినూతల సర్పంచులు చిలక వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేంద్ర, నాయకులు వెనిగండ్ల మురళి, ఇటుకల శ్రీనివాసరావు, సండ్ర వెంకట్ రావు, సండ్ర .కిరణ్ తదితరులు పాల్గొన్నారు.