Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్లెప్రగతి కార్యక్రమం తోపాటు పల్లెనిద్ర కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపులో భాగంగా మండలపరిధిలో వెంకటాపురం, గంధసిరి గ్రామాలలో బుధవారం రాత్రి ఎంపీడీవో డి. శ్రీనివాసరావు, ఎంపీవో పి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో డి శ్రీనివాసరావు రాత్రి వేళలో గ్రామంలోని పలు వీధులలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దళిత బహుజన కాలనీలలో ఆయన కలియతిరిగి ప్రజలతో ముచ్చటించారు గ్రామ ఉపసర్పంచ్ గంట పద్మావతి ఇంట్లో ఎంపీడీవో డి శ్రీనివాసరావు భోజనం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రాత్రి బస చేశారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్లు కోటి అనంత రాములు, రాజుల సీతమ్మ, ఉపసర్పంచ్లు గంట పద్మావతి, దేవరపల్లి రాఘవరెడ్డి, ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు కొండ నరేష్, నాయిని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.