Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని దామరతోగు గ్రామంలో బుధవారం ఎన్సీడీ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. బీపీ, సుగర్ పేషెంట్లను గుర్తించడంతో పాటు కోవిడ్ టెస్టులు చేసి కరోనా పాజిటివ్ వచ్చిన ఒక యువతికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రవిచంద్ మాట్లాడుతూ.... కరోనా పట్ల జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గోపిలాల్, పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్, ఏఎన్ఎం కమలా, హెచ్ఏ బిక్షా, ఎంటీఎస్ సత్యం, ఆశా కార్యకర్తలు సుమలత, రాంబారు పాల్గొన్నారు.