Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం
నవతెలంగాణ-కారేపల్లి
ఎమ్మెల్యే గారు నేను వస్తున్నాను అని తెలిసి ఐదు నిమిషాలు ఆగలేక పోయారా అంటూ వేదిక మీద ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ నుద్దేశించి జడ్పీటీసీ వాంకు డోత్ జగన్ అనటంతో సభలో వాతావరణం కొంత వేడెక్కింది. బుధవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్బంగా జడ్పీటీసీ, వైరా ఎమ్మెల్యేల మధ్య మాటల సంవాదం నడించింది. ''జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ గారూ మీ ఆముల్యమైన సమయాన్ని గంటపాటు మాకు వెచ్చించండీ'' అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యనించటంతో కలుగజేసుకున్న జడ్పీటీసీ ''నాకు సమాచారం సరిగా ఇవ్వరు, వస్తున్నాను అని తెలిసినా మీరు ఒపిక పట్టి ఆగరు'' అంటూ ఎమ్మెల్యే నుద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే అయిన నేను ఆగాలా... మీరు ముందుగా రావాలి జడ్పీటీసీ గారు... డిసిప్లిన్ పార్టీలో ఉన్నాము కాబట్టి మీరు అందరికంటే ముందుగా వచ్చి ఉండాలి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎదురువాదనకు దిగుతుండగా ''ఇక ఆగవయ్యా, కూర్చో'' అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యనించారు. ఈసందర్బంగా ఇరువురి మధ్య కొంత మాటల యుద్దం జరిగింది. తర్వాత జడ్పీటీసీ జగన్ భుజంపై చేయి వేసి హరితహారం కార్యక్రమానికి తోడ్కొని వెళ్ళారు.