Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోరం సత్యమ్మపై దౌర్జన్యానికి
- పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
- తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించిన సత్యమ్మ కుటుంబం
- మద్దతు తెలిపిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మీదేవి పల్లి మండలంలోని పడగాయి గూడెం గ్రామంలో గత 60 సంవత్సరాల నుండి కొరెం సత్యమ్మ గ్రామంలో నివసిస్తుంది. ఆమెకు వారి కుటుంబం నుండి మూడు ఎకరాల భూమిని వారసత్వంగా ఇచ్చారు. నాటి నుండి నేటి వరకు అట్టి భూమిని సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా కూడా ఇవ్వడం జరిగింది. అట్టి పట్టాపై రైతుబంధు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. సత్యమ్మ కుటుంబానికి ఆమె సాగుచేసే భూమికి ఇటువంటి సంబంధం లేని వజ వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులు గత 15రోజులుగా సత్యమ్మ సాగుచేస్తున్న భూమిపై మారణాయుధాలతో ట్రాక్టర్‌తో వచ్చి బెదిరింపులకు పాల్పడి, అట్టి భూమిని దున్నడం జరిగింది. ఈ విషయంపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తహసీల్దార్‌కి దరఖాస్తు ఇచ్చారు. చట్టపరంగా వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామపెద్దలు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యానికి పాల్పడుతున్న వెంకటేశ్వరుని మందలించినప్పటికీ వెంకటేశ్వర్లు వెనుకకు తగ్గక పోకపోవడం, తిరిగి సత్యమ్మను చంపుతామని బెదిరిస్తూ అక్రమంగా పొలాన్ని దున్ని విత్తనాలు వేయడంతో సత్యమ్మ దిక్కు తోచని స్థితిలో ఉందని, న్యాయంకోసం లక్ష్మీదేవి పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించిందని తెలిపారు. స్పందించకుంటే రిలే నిరాహార దీక్షకు పూనుకుంటానని తెలిపారు. సత్యమ్మ నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ, యు.నాగేశ్వరరావు, నల్లమల సత్యనారాయణ, ఎంపిటిసి లలిత, నరసమ్మ, శిరోమణి, గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న, భూకబ్జాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.