Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
జీలుగు వలన పంట భూసారం పెంచుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. బుధవారం పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణ్ రావు, కేశవరావు, రమేశ్‌లు పర్యటించి పచ్చి రొట్ట ఎరువుగా జీలుగు సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి వారికి పంట ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ జీలుగు వల్ల పంట భూసారం పెంచుతుందని, నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెంచుతుందని, ఎరువులు వాడకం 20 శాతం తగ్గించవ్చని, చీడ పీడల ఉదృతి తగ్గుతుందని చెప్పారు. ఒక ఎకరం జీలుగ పంటకు 8-10 టన్నుల పచ్చి రొట్టా వస్తుందని, దీని ద్వారా భూమిలో 20-30 కేజీ ల నత్రజని, 7కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్‌ను భూమికి అందిస్తుందని తెలిపారు. మండలంలో రైతులు కూడా జీలుగులు పంటను పచ్చి రొట్టా ఎరువుగా పెంచి భూమి సారం పెంచుకోవాలని తెలిపారు. దమ్ము చేసే సమయంలో సూపర్ ఫాస్ఫేట్ వాడితే పచ్చి రొట్ట త్వరగా కుళ్లి భూమికి సారం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు గీదా కొండయ్య, మిరియాల రాంబాబు, సురసాని వెంకట రెడ్డి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, పోలిశెట్టి రాంబాబు, తాతాజీ తదితర రైతులు పాల్గొన్నారు.